మన ప్రతి న్యూస్/ ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మిరుదొడ్డి విష్ణు వయస్సు 22సంవత్సరాలు, అను అతని ఇంటి ముందు పెట్టిన బండి ఎవరో గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లినారని కేస్ పెట్టగా ఎల్లారెడ్డిపేట ఎస్సై కి రాహుల్ రెడ్డి కేసు నమోదు చేసినారు. దర్యాప్తులో భాగంగా సోమవారం రోజున బండి దొంగలించిన గుగ్గిళ్ళ నరేష్ వయసు 28 సంవత్సరాలు గ్రామం బొప్పాపూర్ మరియు బొడ్డు నిఖిల్, వయస్సు (25) గ్రామం తిమ్మాపూర్ అను ఇద్దరినీ సోమవారం రోజున పట్టుకున్నారు. గుగ్గిళ్ళ నరేష్ గతంలో గంభీరావుపేట మండలం లింగన్నపేటలో తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనం చేసి జైలుకు వెళ్లి వచ్చినాడు మరియు బొడ్డు నిఖిల్ గతంలో ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ లో ఫోన్ దొంగతనం కేసులో జైలు వెళ్లి వచ్చినాడు. వీరిద్దరి వద్దనుండి దొంగిలించబడిన బండిని ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి స్వాధీన పరుచుకుని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినారు దొంగతనం కేసులు చేదించి చాకచక్యంగా దొంగల్ని పట్టుకున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ బాబయ్య అరవింద్ ను ఎస్ఐ గారు ప్రత్యేకంగా అభినందించారు
