Breaking News

వివాహిత మహిళ అదృశ్యం

ములకలపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి:

ఊయలే ఉరితాడుగా.. ఎనిమిదేళ్ల బాలిక మృతి

ములకలపల్లి మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన ఒక వివాహిత మహిళ అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సున్నం మహాలక్ష్మి (28), భర్త చంటి, ఎస్టి కోయ సమాజానికి చెందిన కూలీ కార్మికురాలు. ఆమె 01-03-2026న సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో “బంధువుల ఇంటికి వెళ్లి వస్తా” అని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లింది. అయితే ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు.
కుటుంబ సభ్యులు, బంధువులు మరియు గ్రామస్థులు పలుచోట్ల వెతికినా ఆమె గురించి ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ములకలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంపై ఎస్‌ఐ ములకలపల్లి మాట్లాడుతూ, “మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నాం. త్వరలోనే ఆమె ఆచూకీ లభిస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు. గ్రామంలో మహిళ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు వేగంగా చర్యలు తీసుకుని మహిళను సురక్షితంగా కనుగొనాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు