మన ప్రగతి న్యూస్ /మేడిపల్లి
తండ్రి మందలించాడని కుమారుడు అదృష్టమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం మేడిపల్లి మండలం సత్యనారాయణపురం కాలనీలో నివసించే రామ్ శెట్టి శ్రీను (45) స్థానికంగా వాటర్ ప్లాంట్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.అతనికుమారుడు రామ్ శెట్టి మహేష్ (23) చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నాడని మందలించడంతో ఫిబ్రవరి 27న రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఎవరికీ చెప్పపెట్టకుండా ఇంటి నుంచి పారిపోయాడు.మహేష్ ఆచూకీ కోసం చుట్టుపక్కల ఎక్కడ వెతికిన తన ఆచూకీ తెలియరాలేదు.తండ్రి శ్రీను మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా,మెసిపల్లి ఏస్ ఐ కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంబించడం జరిగింది.

