మన ప్రగతి న్యూస్ / వైరా ప్రతినిధి
ఏన్కూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మల్లు రామకోటి కుమారుడు మల్లు సాయి (30) బుధవారం సాయంత్రం కాలువలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై సంధ్య సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. స్థానికుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


