Breaking News

కేసముద్రం మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక..

  • అధ్యక్షులుగా ఎసల్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా గందసిరి యాకాంబ్రం.
  • ఉపాధ్యక్షుడిగా మంద విక్రమ్, సోమారపు శ్రీరాములు,
  • కోశాధికారిగా తాడూరి ఉమేష్.
  • కార్యవర్గ సభ్యులుగా మిట్ట గడుపుల మహేందర్, రాజేంద్ర చారి, బోడ ప్రశాంత్.

మన ప్రగతి న్యూస్/కేసముద్రం:

కేసముద్రం మండల పత్రిక విలేకరుల ఆధ్వర్యంలో కేసముద్రం నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రెస్ క్లబ్ కు అధ్యక్షుడిగా వార్త దినపత్రిక సీనియర్ రిపోర్టర్ ఎసల్ల సత్య నారాయణ, ప్రధాన కార్యదర్శిగా పీపుల్స్ డైరీ పత్రిక రిపోర్టర్ గందసిరి యాకాబ్రం లను ఏక గ్రీవంగా ఎన్ను కున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా మంద విక్రమ్, సోమవారపు శ్రీరాములు, కోశాధికారిగా తాడూరు ఉమేష్, జాయింట్ సెక్రెటరీ మిట్ట గడుపుల మహేందర్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఎసల్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. నిస్వా ర్థంతో, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తున్న కలం మిత్రుల సమస్యలు పరిష్కరించడానికి ముందుంటానని, అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పాత్రికేయ మిత్రుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా లేని ప్రెస్ క్లబ్ నిర్మాణంలో సహకరిం చిన ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు కూన శ్రీను, గాజుల రవి, జన్ను శ్రీను, కందు కూరి రాజు చారి, వంశీ కృష్ణ, కాసు సతీష్, బాల, కిరణ్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

లాడ్జిల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి