Breaking News

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” పకడ్బందీగా అమలు చేయాలి” జిల్లా కలెక్టర్..

_ ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వ తేదీ వరకు కార్యక్రమాలు

_ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలి

_ శాఖలకు నిర్దేశించిన పక్కా ప్రణాళిక, లక్ష్యం ప్రకారం ముందుకు వెళ్లాలి

_ ఈ నెల 12 వ తేదీన సర్పంచ్, మున్సిపల్ చైర్మన్లు, వార్డు సభ్యులకు శిక్షణ

_ జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, వైద్య అధికారులతో సమావేశం..

మన ప్రగతి న్యూస్ /
రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్ :

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” పై జిల్లాలో నిర్వహించాల్సిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, వైద్య అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, నిర్ణీత కాలపరిమితిలో లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత ఉందని వెల్లడించారు.
ప్రతి జిల్లా అధికారి తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పథకాలు అమలు చేయాలని ఆదేశించారు. మండల అధికారులు తమ పరిధిలోని హౌసింగ్, పీఆర్, ఆర్ అండ్ బీ, సెస్ ఏఈలు, అంగన్వాడీ సూపర్ వైజర్లు, మండల వైద్యాధికారులు, ఎస్ హెచ్ఓ, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. తమ పరిధిలోని అన్ని అంశాలపై చర్చించాలని, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ప్రజాప్రతినిధులను ఆయా కార్యక్రమాలకు ఆహ్వానించి సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ నెల 12 వ తేదీన జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ ల సర్పంచులు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల వార్డు సభ్యులు, చైర్మెన్లకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక పై శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ఆయా శాఖల పరిధిలో అమలు చేస్తున్న పథకాలు, వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

_ ఐదు దశలో కార్యక్రమాలు

ఏప్రిల్ 2 (మొదటి దశ)
గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ

ఏప్రిల్ 16 (రెండో దశ)
మండల స్థాయిలో కార్యక్రమాలు

మే 2 (మూడో దశ)
నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు
మే 22 (నాలుగో దశ)
జిల్లా స్థాయిలో విస్తృత కార్యక్రమాలు జూన్ 2 వ తేదీ (ఐదో దశ)
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారని వివరించారు. గ్రామ సభ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా వివిధ శాఖల జిల్లా అధికారులు తమ పరిధిలో చేపట్టనున్న పనులు, యాక్షన్ ప్లాన్, లక్ష్యాల వివరాలు వెల్లడించారు.

వివిధ శాఖల షెడ్యూల్, కార్యక్రమాల వివరాలు

పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కరణ

పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అలాగే అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మార్చి 6 వ తేదీ నుండి మార్చి 15 వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

ఆరోగ్యం

వైద్య ఆరోగ్య శాఖ, మహిళా, శిశు అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 వ తేదీ నుండి ఏప్రిల్ 11 వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

లాడ్జిల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

అరైవ్ అలైవ్

హోం శాఖ, రవాణా శాఖల ఆధ్వర్యంలో ఏప్రిల్ 13 వ తేదీ నుండి ఏప్రిల్ 18 వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

సంక్షేమం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు హౌసింగ్ శాఖల ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 వ తేదీ నుండి ఏప్రిల్ 26 వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

శిశు భద్రత, రక్షణ – “డ్రగ్స్‌కు నో చెప్పండి”

వైద్య ఆరోగ్య శాఖ, మహిళా, శిశు అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఏప్రిల్ 27 వ తేదీ నుండి మే 2 వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

వ్యవసాయం

వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల, ఇంధన శాఖల ఆధ్వర్యంలో మే 4 వ తేదీ నుండి మే 10 వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

విద్య

విద్యాశాఖ ఆధ్వర్యంలో మే 11 వ తేదీ నుండి మే 16 వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

యువజన, క్రీడలు

యువజన వ్యవహారాలు, పర్యాటక, క్రీడా శాఖల ఆధ్వర్యంలో మే 18 వ తేదీ నుండి మే 23 వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

మహిళలు

మహిళా, శిశు అభివృద్ధి శాఖ, సెర్ప్ / మెప్మా ఆధ్వర్యంలో మే 25 వ తేదీ నుండి మే 30 వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

పర్యావరణం

అటవీ, పర్యావరణ, విజ్ఞాన సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో జూన్ 1 వ తేదీ నుండి జూన్ 12 వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్డీఓ గీత, డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, డీపీవో షరీఫుద్దిన్, జిల్లా వైద్యాధికారి రజిత, హౌసింగ్ పీడీ సాజిద్, డీ టీఓ లక్ష్మణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్ తదితరులు పాల్గొన్నారు.