Breaking News

లాడ్జిల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

:మైనర్లకు గదులు ఇవ్వొద్దు.. లాడ్జిలకు సీఐ హెచ్చరిక

:అతిథుల ఐడీ ధృవీకరణ తప్పనిసరి, లాడ్జిలకు సూచనలు

:సీఐ వీరప్రసాద్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” పకడ్బందీగా అమలు చేయాలి” జిల్లా కలెక్టర్..

మన ప్రగతి న్యూస్ /వేములవాడ:

వేములవాడ పట్టణంలో ప్రైవేటు లాడ్జిల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పట్టణ సీఐ వీరప్రసాద్ సూచించారు. లాడ్జిలకు వచ్చే అతిథుల వద్ద పూర్తి గుర్తింపు ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా మైనర్లకు గదులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.లాడ్జిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.లాడ్జిలకు వచ్చే అతిథుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని తెలిపారు. భద్రతా పరమైన అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.నిబంధనలు పాటించని లాడ్జిల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వీరప్రసాద్ స్పష్టం చేశారు.