మన ప్రగతిన్యూస్/ ఎల్లారెడ్డిపేట
ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆలకుంట రాజు వయసు 41 సంవత్సరాలు గ్రామం తిమ్మాపూర్ అను అతని ట్రాకర్ ను గురువారం రోజున పట్టుకొని ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి కేసు నమోదు చేసి, అట్టి ట్రాక్టర్ డ్రైవర్ ఆలకుంట రాజు ను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్కు పంపడమైనది. ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసినట్లయితే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కే రాహుల్ రెడ్డి హెచ్చరించినారు.

