Breaking News

నూతన వధూవరులను ఆశీర్వదించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం గంగుల నాచారం గ్రామానికి చెందిన ముత్తి వెంకటేశ్వరావు–విజయ దంపతుల కుమారుడు ప్రవీణ్ వివాహ వేడుకలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వెళ్లిన మంత్రి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటిస్తూ దంపతుల భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొని వధూవరులను అభినందించారు. వివాహ వేడుక ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది.

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఒక వ్యక్తి అరెస్ట్, రిమాండ్ కు తరలింపు: