విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి
–ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
మన ప్రగతి న్యూస్ /వేములవాడ:
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో మంచి అవకాశాలు సాధించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గానికి రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేశారని తెలిపారు. ఈపాఠశాల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పారు. ఈ విద్యాలయంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయని వెల్లడించారు.యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.అలాగే చందుర్తి గ్రామంలో 67 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, 803 మందికి రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని తెలిపారు.అదేవిధంగా 135 మంది అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

