600 కేజీల నల్ల బెల్లం సీజ్ ఒక వ్యక్తి రిమాండ్
మన ప్రగతి న్యూస్/ కల్వకుర్తి :
తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషన్ ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షాన వాజ్ కద్రా ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ మార్చ్ 5వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఎక్సైజ్ శాఖ చేపట్టింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా ఎక్సైజ్ అధికారి గాయత్రి మార్గదర్శకత్వంలో కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో విస్తృతంగా దాడులు జరుపబడుచున్నది. వంగూరు మండలం తిరుమలగిరి తండాలో అక్రమ నాటు సారాయి తయారీ మరియు రవాణా నల్ల బెల్లం సరఫరా నిలువపై దాడులు జరిపి రెండు బైకులు, 600 కేజీల నల్ల బెల్లం, నాలుగు లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని నల్ల బెల్లం అక్రమ సరపరదారు మూడవత్ హనుమంతు వ్యక్తిని అరెస్టు చేసి కల్వకుర్తి సబ్ జైలుకు రిమాండ్ పంపనయింది. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సర్కిల్లోని అన్ని మండలాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి అక్రమ నాటు సారా నల్ల బెల్లం సరఫరా గంజాయి డ్రగ్సు మద్యంపై నిగా ఉంచి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది. ఒకసారి పట్టుబడిన నేరస్తులను బైండోవర్ చేసి మళ్లీ నేరానికి పాల్పడితే లక్ష రూపాయలు జరిమానా విధించబడును పదేపదే నేరాలకు పాల్పడితే ఆర్ టి యాక్టివ్ నమోదు చేసి సంవత్సరం పాటు జైలునిర్బంధంలో ఉంచబడును. ఇట్టి దాడులలో ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ వెంకటేశ్వర్ రెడ్డి, జాబర్ ఎస్సై నాగరాజు,కల్వకుర్తి ఎస్సై వివేక్ సిబ్బంది జనార్ధన్, నార్య పరుశురాం, జ్యోతి పాల్గొన్నారు.

