Breaking News

వేములవాడలో షాదీఖానాకు రూ.80 లక్షలు మంజూరు

స్థల పరిశీలన చేసిన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు

మన ప్రగతి న్యూస్ /వేములవాడ:

నేరాల నియంత్రణ మన అందరి బాధ్యత. ఎస్సై గణేష్

వేములవాడ పట్టణాభివృద్ధిలో కీలక ముందడుగు పడింది.ముస్లిం సోదరుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం షాదీఖానా నిర్మాణానికి రూ.80 లక్షలను మంజూరు చేయడం విశేషం.ఈ నేపథ్యంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్‌తో పాటు ఇతర మత పెద్దలతో సమావేశమై, షాదీఖానా నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ నిధులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతోనే మంజూరయ్యాయని చైర్మన్ పేర్కొంటూ, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. పట్టణంలో మైనార్టీ వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.