మన ప్రగతి న్యూస్/ నడికూడ:
బాలల పరిరక్షణ గ్రామ కమిటీలలో పరి ష్కారం కాని సమస్యలను మండల బాల ల పరిరక్షణ కమిటీ పరిష్కరిస్తుందని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధి కారి ఆర్. రామకృష్ణ అన్నారు. ప్రజా పరిషత్ కార్యాలయంలో సమావే శం నిర్వహించారు. మండల కేంద్రంలోని అన్ని గ్రామాల బాలల పరిరక్షణ కమి టీలను సమన్వయం చేసుకుంటూ.. ఈ మండల కమిటీ పని చేస్తుందని వారు అన్నారు. బాలల పరిరక్షణ కు ఈ కమిటీ నిత్యం కృషి చేస్తుందన్నారు. గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు ప్రణాళికలను తయారు చేసు కోవడం, సమస్యల్లో అవగాహన పెంచడం, సమస్యల పరిష్కారంలో మరలా కమిటీ అవసరమైన శిక్షణను ఆదేశాలను అందిస్తుందని, బాలల పరిరక్షణ కమిటీల మార్గదర్శన, పర్యవేక్షణ, అవసరమైన వనరులు సమకూర్చడం మండ ల కమిటీ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కమిటీకి చైర్మెన్ గా స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్, కార్యదర్శిగా.. ఎంపీడీవో రామకృష్ణ, కన్వీనర్ గా సిడిపిఓ స్వాతి, కమిటీ సభ్యులుగా.. ఎంఈఓ హనుమంత రావు, నోడల్ సభ్యులుగా నడికూడ సర్పంచ్ కుడ్ల మలహాల్ రావు, సర్వా పూర్ సర్పంచ్ భోగి శ్రీలత. చైల్డ్ హెల్ప్ లైన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులుగా భాస్కర్, సిహెచ్ రవీందర్, సభ్యులుగా మండల వైద్యాధికారి పి. స్వాతి, సిడిపిఓ ఇన్స్పెక్టర్ గా రమేష్, న్యాయశాఖ అధికారిగా వినోద్ కుమార్, గ్రామ బాలల పరిరక్షణ కమిటీ బాలలు విష్ణు, సిరి. మండల సమాఖ్య అధ్యక్షురాలు హారిక, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సభ్యు లుగా ఎస్. ప్రవీణ్ కుమార్, యువజన సంఘం సభ్యులుగా బి. ప్రీతం లు ఎన్ను కోబడ్డారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సూపర్వైజర్ కె. శ్రీదేవి, పలు గ్రామాల కార్యదర్శులు, అంగన్వాడీలు ఎన్. అనిత, డి. సంపూర్ణ, డి. కళావతి, డి. వినోద, తదితరులు పాల్గొన్నారు.

