బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి..

  • ఆసుపత్రులపై దాడులు చేయొద్దు.
  • సూర్యాపేట ఎస్పీ నరసింహ.

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట జిల్లా ప్రతినిధి:

ఆసుపత్రి, ఆసుపత్రికి సంబంధించి న సామాగ్రిని ద్వంసం చేసిన, ఆసుపత్రి సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగు తుందని జిల్లా ఎస్పి నరసింహ అన్నారు. ఆసుపత్రిపై దాడి, సామాగ్రి డామేజ్, సిబ్బందిపై దాడులు లాంటి సంఘటనలు జరుగుతున్న నేపధ్యంలో సూర్యా పేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యం జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అనివార్య సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ శాఖ రక్షణ కల్పించాలని ఆసుపత్రి యాజ మాన్యాలు కోరా యి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు, ప్రజలకు విలువైన వైద్య సేవలు అందించాలని ఐఎంఏ డాక్టర్లకు సూచించారు. ప్రజల నమ్మకం చూరగొనే విధంగా వైద్యం సహాయం అందిం చాలని తెలిపారు. నాణ్యమైన పరికరాలు, నైపుణ్యం గల సిబ్బందిని నియమిం చుకోవాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రి నందు వైద్య నిమిత్తం వచ్చిన ప్రజ లు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆసుపత్రి యాజమాన్యాలను, ఆసుప త్రులను లక్ష్యంగా దాడులు లాంటివి చేయకూడదని, సామాగ్రిని ధ్వంసం చేయడం సిబ్బందిని గాయపరచడం లాంటివి చేయకూడదని పేర్కొన్నారు. ఇలాంటివి చట్టపరంగా నేరమన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. సమస్యలు ఏమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచిం చారు. ప్రభుత్వ వైద్యశాల నందు నాణ్యమైన వైద్యం అందుతుందని, ప్రజ లందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూర్యాపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా. ఆనంద్ దాంగ్డే, జనరల్ సెక్రెటరీ డా. రమేష్, డా. రామ్మూర్తి, డా. యశ్వంత్ రెడ్డి పటేల్, డా. అనూ ష, డా. సుప్రజ, డా. శ్రీరామ్ లు ఉన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం