Breaking News

ప్రమాదవశాత్తు మొక్కజొన్న చొప్ప దగ్ధం..

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:

మండల కేంద్రానికి చెందిన నాగేల్లి సురేందర్ అనే రైతు పంట పొలంలో ప్రమాదవశాత్తు మొక్కజొన్న చొప్పకాలి భారీ నష్టం వాటిల్లింది. పంట పొలం లో ఉన్న డ్రిప్ పైపులు, వాటికి సంబంధించిన వస్తువులు, పంట పొలానికి దగ్గరగా ఉన్న గడ్డి వాము, మొత్తం కాలిపోయి సుమారుగా 1,50,000 రూపాయల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే అధికా రులు స్పందించి, ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి..