బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

గంగపుత్రులను అధికారికంగా గుర్తించాలి

బీసీఏలో ముదిరాజులను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నాం

పట్టణ గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుంటి సంజీవ

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

పట్టణంలోని గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుంటి సంజీవ ఆధ్వర్యంలో గంగ పుత్రులు ఆర్డిఓ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుండి సంజీవ మాట్లాడుతూ బెస్త, గంగపుత్ర కులస్తులను ఈమధ్య ప్రకటించిన సమగ్ర సర్వేలో ప్రభుత్వం జనాభా లెక్కల్లో చూపెట్టలేదని, ఉపకులాలుగా చూపెట్టడం జరిగిందని అన్నారు. బెస్త గంగపుత్రం కులాలు, ఉప కులాలు కాదని గుర్తు చేశారు. గంగపుత్రులేని సమాజాన్ని ఊహించుకోలేమని, గంగపుత్రులం చేపలు పట్టుకొని జీవించే వారమని, అనాదిగా మాది ఇదే వృత్తి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బెస్త, గంగపుత్ర కులాలను అధికారికంగా ప్రకటించాలని కోరారు. తెలంగాణలో ఐదు ఆరు లక్షల జనాభా ఉన్న గంగపుత్రులను చూపెట్టకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అదే విధంగా బీసీడీలో ఉన్న ముదిరాజులను బిసిఏ లో కలపడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వ్యతిరేకించారు. సంపన్న వర్గానికి చెందిన ముదిరాజులు బీసీఏలోకి వస్తే బీసీ ఏ లో ఉన్న 57 కులాలు వారి ప్రాతినిధ్యం కోల్పోతారని ఉనికి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బీసీఏ లో ఉన్న కులాలకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదరణ లేకుండా వెనుకబడి ఉన్నామని, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు, ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోబోకపోతే బీసీ ఏ కులాలు భారీ ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎర్రబోయిన కిషన్, జిజుల సాగర్, చింతల టార్జాన్,అంకాల మల్లికార్జున్, అంకాల సురేష్, పూస ఏకాంబరం, మేదరబోయిన శ్రీనివాస్, కాపర బోయిన రమేష్,గుంటి శ్రీనివాస్, అంబటి సంజీవ తదితరులు పాల్గొన్నారు.