బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

చోరీ కేసును చేధించిన పాలకుర్తి పోలీసులు..

  • ఇద్దరు దొంగల అరెస్టు, రిమాండ్ కు తరలింపు..
  • 6 లక్షల 25 వేలు బంగారు వెండి వస్తువుల స్వాధీనం..
  • వివరాలు వెల్లడించిన ఎస్ఐ .పవన్ కుమార్.

మన ప్రగతి న్యూస్ /పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:

పలు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తు లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి నట్లు పాలకుర్తి ఎస్ఐ .పవన్ కుమార్ తెలిపారు. శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ. పవన్ కుమార్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. పాల కుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పలు ఇండ్లలో చోరీ కేసులకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి సుమారు 3 తులాల బంగారం, 70 తులాల వెండి వస్తువులు ఒక కారు, ఆటోను స్వాధీనం చేసుకోని రికవరీ చేయడం జరిగిందని,బంగారం వెండి వస్తువుల విలువ సుమారు 6 లక్షల 25 వేల విలువ వరకు ఉంటుందని పేర్కొ న్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగెలవీడు గ్రామానికి చెందిన దాసరి మురళీకృష్ణ, దాసరి మురళి పాత నేరస్తులు, వీరిపై గతంలో కూడా పలు దొంగతనం కేసులు నమోదై ఉండగా.. పలుమార్లు జైలుకు వెళ్లివచ్చినట్లు విచారణలో తెలిసిందన్నారు. నిందితులు పాలకుర్తి, కేశవ పట్నం, చొప్పదండి ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపా రు. వేసవి కాలంలో ఇండ్లలో చోరీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండడంతో ప్రజలు రాత్రి సమయంలో బయట నిద్రించే సందర్భాల్లో బంగా రు ఆభరణాలు ధరించకుండా ఉండాలని, ఇంటికి తాళాలు వేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ సూచించారు. ఈ కేసును సమర్థవంతంగా చేదించినందుకు వరంగల్ జిల్లా కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్. వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ పాలకుర్తి సీఐ జానకిరామ్ రెడ్డి, ఎస్సై డి. పవన్ కుమార్, ఐ డి అసిస్ట్ అనలిస్ట్ సల్మాన్‌ లను హెడ్ కానిస్టేబుల్ సోమిరెడ్డి, కానిస్టేబుళ్లు రమేష్, రాజ్‌కుమార్, యాకయ్య, ప్రశాంత్ రెడ్డి లను కమిషనర్ అభినందించారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం