మన ప్రగతి న్యూస్/ హుజూర్నగర్
హుజూర్ నగర్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లు నుండి వస్తున్న బూడిద ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.కొన్ని ప్రాంతాల్లో ఇండ్లలో ఉండలేని పరిస్థితి. బూడిద పెద్ద ఎత్తున ఇండ్ల మీద, ఇండ్లలో పడుతుంది. వంట గదుల్లోకి సైతం దూసుకుని వెళ్లి ఆహార పదార్థాలను కాలుష్యం చేస్తుంది. మిల్లుల నుండి వేలబడుతున్న కాలుష్యాన్ని అరికట్టంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఘోర వైఫల్యం చెందుతోంది .కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకోవడమే తప్ప ప్రజల బాగోగులు పట్టించుకునే స్థితిలో మిల్లర్లు లేకపోవడం దురదృష్టకరం.ప్రతి ఏడాది ఇదే గంధర గోళం. బూడిద వస్తుందని ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. ప్రతి మిల్లులో బూడిద గొట్టాల దగ్గర నీటి స్పిన్క్లర్లను ఏర్పాటు చేశామని చెబుతున్నారు తప్ప వాటిని పని చేయించటం లేదని తెలుస్తోంది. ఈ బూడిద తో వెలువడుతున్న బూడిద, వరి కొయ్య కాలు కాల్చడం వల్ల వస్తున్న బూడిద అన్ని రకాల బూడిద ప్రజలపై దాడి చేస్తుంది. ఎండాకాలం ఆరు బయట కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది.
శ్రీనగర్ కాలనీ,మల్లన్న నగర్, సీతారాం నగ,ర్ టీచర్స్ కాలనీ, ఉత్తమ పద్మావతి నగర్, అడ్డరోడ్డు తదితర ప్రాంతాలలో బూడిద ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.ఈ బూడిద వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలే అవకాశమున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అలాగే శరీరంపై దుద్దుర్లు వస్తున్నట్లుగా ఫిర్యాదు చేశారు. పట్టణానికి మిల్లులన్నీ తూర్పు వైపు ఉన్నాయి. పడమట గాలులు వీస్తుండటంతో బూడిద మొత్తం పట్టణంపై పడుతోంది. మిల్లుల నుండి బూడిద బయటికి రాకుండా చర్యలు తీసుకోవాల్సింది మిల్లర్లే. అందుకు విరుద్ధంగా బూడిదను ప్రజల పైకి వదిలి వారు మాత్రం పెద్ద ఎత్తున బియ్యం వ్యాపారం చేస్తుండటం పట్ల విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ విషయాన్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుని దృష్టికి హుజూర్ నగర్ అభివృద్ధి కమిటీ తీసుకుపోవటం జరిగింది .అలాగే మరికొందరి మిల్లర్ల దృష్టి కూడా ఈ విషయాన్ని తెలియజేశాను. మిల్లర్లు తక్షణమే మిల్లుల నుండి బూడిద రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్టి విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

