- తెగిపడ్డ 11 కెవి విద్యుత్ వైరు
- బీడు ఖనిజపురాలలో మంటలు
- భయాందోళనకు గురైన సమీప గ్రామాల ప్రజలు..
- మూడు ఎకరాల మామిడి తోట అగ్నికి ఆహుతి..
- సుమారు పది లక్షల ఆస్తి నష్టం..
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:
ప్రమాదవశాత్తు ఎండ తీవ్రతకు విద్యుత్ 11 కెవి వైర్లు కరిగి పడ డంతో రాళ్లను సైతం రంధ్రాలు చేసి మంటలు చెలరేగడంతో పాటు సమీప మామిడి తోటకు నిప్పంటు కొని డ్రిప్పు పైపులైను మోటర్లు దగ్ధ మైన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కన్నరావుపేట బుచ్చిరెడ్డి పల్లె గ్రామాల మధ్య చోటు చేసుకుంది. స్థానికుల కథ నం ప్రకారం కన్నారావుపేట బుచ్చి రెడ్డిపల్లి గ్రామాల మధ్య ఉన్నటు వంటి 11 కెవి మెయిన్ విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు ఎండ తీవ్రత కు కరిగిపోయి తెగి కింద పడిపోవ డంతో ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఈ సంఘటన స్థలంలో బీడు ఓవర్ కనిజపు రాళ్ల పై ఈ విద్యుత్ వైరు కరిగి తెగిపడడంతో రాళ్లకు సైతం రంధ్రాలు ఏర్పడి రాళ్ల లోపల మంటలు చేరేగాయి. ఈ సంఘట నతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.ఆ సమయంలో ఆ ప్రాంతం లో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క సమీప పంట చేలతో పాటు మూ డు ఎకరాల మామిడి తోటకు నిప్పంట్టుకోవడంతో చాలా చెట్లు పూర్తిగా కాలి పోగా.. మరికొన్ని చెట్లు పాక్షికంగా కాలినట్లు బాధిత రైతు కంచనకుంట్ల సురేందర్ రెడ్డి వాపోయాడు. డ్రిప్ పైపులైను మోటర్లు సైతం అగ్నికి ఆహుతి కావడంతో సుమారు పది లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసి అదుపులోకి తీసుకు వచ్చారు. అనంతరం విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని 11కె.వి విద్యుత్ వైర్లను అక్కడి నుండి తొలగించి గ్రామస్తుల సహకారంతో మంటలు ఆర్పి వేశారు..అనంతరం విద్యుత్ వైర్లను బిగించి, విద్యుత్తును పునరుద్ధరించారు. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తెగి ప్రమాదం వాటిల్లిన నేపథ్యంలో అగ్నికి ఆహుతైన మామిడి తోట బాధిత రైతును ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవడంతో పాటు సంబంధిత విద్యుత్ శాఖ నుండి నష్టపరిహారం ఇప్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


