తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం
మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర అభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ మంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్ర కుల గణన లో అగ్నికుల క్షత్రియను తొలగించాలని కోరినారు. ఈ తొలగించే ప్రక్రియ జరుగు తున్నదని త్వరలో ఉత్తర్వులు వస్తాయని ఇది నా బాధ్యత అని మంత్రి హామీని ఇచ్చారు.
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ను కలసి ముదిరాజులను బిసి ఏ గ్రూపులో చేర్చరాదని మరియు రాష్ట్ర విభజనలో జీవో ఎం ఎస్ 3 ద్వారా తొలగించబడిన బీసీ కులాలను కూడా తిరిగి చేర్చుకోరాదని పత్రికలో వచ్చిన సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు బీసీ కమిషన్ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి అని గ్రహించి అభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్యవర్గం వెంటనే బీసీ కమిషన్ చైర్మన్ తో చర్చించనైనది. ఈ విషయాలన్నింటిపై క్షుణ్ణముగా చర్చించడానికి రాష్ట్ర కార్యవర్గ సమావేశం త్వరలో ఏర్పాటు చేయుట కు నిర్ణయించనైనదని తెలిపారు.

