బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఏన్కూరులో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు వైరా ఎమ్మెల్యే బహుమతుల ప్రదానం

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

ఏన్కూరు మండల కేంద్రంలో తరుణ్ మెమోరియల్ ఆధ్వర్యంలో, గరుడ సహకారంతో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ విజేత జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు ప్రదానం చేశారు.టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఖమ్మం జట్టు ప్రథమ బహుమతిని కైవసం చేసుకోగా, ఏన్కూరు జట్టు ద్వితీయ బహుమతిని సాధించింది. విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేయగా క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాసు నాయక్ మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, అభిమానులు, స్థానిక యువకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం