Breaking News

షార్ట్ సర్క్యూట్‌ తో ఎస్బిఐ సేవలకు బ్రేక్..

బ్యాంకు వద్ద ఖాతాదారుల నిరీక్షణ

గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు ఇబ్బందులు

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి:

టీఎల్‌పేట గ్రామంలో వర్షపు నీటి తో రోడ్లపైకి నీరు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్బిఐ బ్రాంచ్‌లో బుధవారం జరిగిన షార్ట్ సర్క్యూట్కారణంగాబ్యాంకింగ్సేవలుతాత్కాలికంగానిలిచిపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగదు లావాదేవీలు, డిపాజిట్లు, ఇతర సేవలు ఆగిపోవడంతో గ్రామాల నుంచి వచ్చిన రైతులు, వృద్ధులు, మహిళలు గంటల తరబడి బ్యాంకు వద్ద వేచి చూడాల్సి వచ్చింది. సాంకేతిక లోపంతో సేవలు నిలిపివేసినట్లు బ్రాంచ్ మేనేజర్ రమేష్ తెలిపారు. సమస్య పరిష్కారానికి పనులు వేగవంతం చేసేందుకు మెకానిక్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరమ్మతులు పూర్తికాగానే సేవలను పునరుద్ధరిస్తామని వెల్లడించారు. అవసరమైతే గురువారం ఉదయం నుంచి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెప్పారు. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులో సేవలు నిలిచిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, సమస్యను త్వరగా పరిష్కరించాలని ఖాతాదారులు కోరుతున్నారు.