బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

నకిలీ విత్తనాల పేరిట రైతులను మోసం చేస్తే ఊరుకునేదే లేదు చట్టబద్ధంగా కఠిన చర్యలు తప్పవు : ఏవో బాలాజీ

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

నకిలీ విత్తనాల పేరిట రైతులను మోసం చేసే వ్యక్తులు, డీలర్లపై చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటామని కొనిజర్ల మండల వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ హెచ్చరించారు. వానాకాలం సాగు సీజన్ నేపథ్యంలో గురువారం మండలంలోని పలు విత్తన దుకాణాలను వ్యవసాయ, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఏవో బాలాజీ మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతించిన కంపెనీల విత్తనాలను మాత్రమే విక్రయించాలని డీలర్లకు సూచించారు. అనుమతి లేని విత్తనాల విక్రయం, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు, రైతులకు రసీదులు ఇవ్వకపోవడం వంటి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. రైతులను మభ్యపెట్టి నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై విత్తన చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, లాట్ నంబర్, కంపెనీ పేరు, ప్యాకెట్ నాణ్యతను పరిశీలించాలని, అనుమతి పొందిన విత్తన దుకాణాల్లోనే కొనుగోళ్లు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన రసీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని తెలిపారు.ఈ తనిఖీల్లో కొణిజర్ల ఎస్సై సూరజ్‌తో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం