బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

వేములవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

చిన్నారులు అధికంగా వినియోగించే పానీపూరి, చాట్ బండ్లపై ప్రత్యేక దృష్టి

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

మన ప్రగతి న్యూస్ /వేములవాడ ప్రతినిధి:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా చిన్నారులు అధికంగా వినియోగించే పానీపూరి, చాట్ బండ్లతో పాటు హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆహార పదార్థాల తయారీ, నిల్వ విధానాలు, ఉపయోగిస్తున్న ముడి సరుకుల నాణ్యతను తనిఖీ చేసి వ్యాపారులకు పలు సూచనలు చేశారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యతలేని, అపరిశుభ్రమైన ఆహార పదార్థాలను విక్రయించవద్దని హెచ్చరించారు.ఆహార భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యాపారం నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తెలిపారు.