మన ప్రగతి న్యూస్ /కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం తేదీ 25 11 2024 సోమవారం మధ్యాహ్నము రెండు గంటల 30 నిమిషాలకు కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తౌటం ఝాన్సీ రాణి రవీందర్ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, కూడా చైర్మన్ లింగాల వెంకటరామిరెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉడితల ప్రణవ్, మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, హాజరవుతున్నారు. కావున ఈ కార్యక్రమానికి కమలాపూర్ మండలంలోని రైతులు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండెపు చరణ్ పటేల్ ,మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బాలసాని రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కోరారు.