Breaking News

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది..కేంద్ర మంత్రి బండి సంజయ్

ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ముండి చేయి చూపెడుతుంది..
_ రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి తెలంగాణ అభివ్రుద్ధికి సహకరించండి.

_ రూ.23 కోట్ల కేంద్ర నిధులతో గంభీరావుపేటలో అభివ్రుద్ధి పనులు ప్రారంభం.

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

గతంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్మును పంజాబ్, కర్నాటక రాష్ట్రాల్లో ని రైతులకు ఖర్చు చేసిండు,ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే తోవల నడుస్తూ తెలంగాణ సొమ్మును మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేసింది అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.శనివారం సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో రూ.23 కోట్ల కేంద్ర నిధులతో అభివ్రుద్ధి పనులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. లింగన్నపేట నుండి కోరుట్లపేట వరకు నిర్మించిన రోడ్డును అ, గంభీరావుపేట నుండి మల్లారెడ్డిపేటకు వెళ్లే దారిలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని అంతకుముందు మల్లారెడ్డిపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి, శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంభీరావుపేట లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ
గతంలో గంభీరావుపేట ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు లింగన్నపేట నుండి కోరుట్లపేట వరకు రూ.15 కోట్ల వ్యయంతో రోడ్డును నిర్మించామని, అట్లాగే గంభీరావు పేట నుండి మల్లారెడ్డిపేట వరకు రూ.8.30 కోట్ల వ్యయంతో నూతనంగా బ్రిడ్జిని నిర్మించి, వాటిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది అని అన్నారు.గతంలోనూ కేంద్ర ప్రభుత్వం సిరిసిల్ల నియోజకవర్గ అభివ్రుద్దికి ఎన్నో నిధులిచ్చింది అని అయితే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తమ సొమ్ముగా ప్రచారం చేసుకున్నాయని రాజకీయ వైషమ్యాలతో గత ప్రభుత్వం కుట్రలు చేసిందని, కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిధులగా చెప్పుకున్నదని అన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తోవలో నడుస్తోంది అని,రాజకీయ వైషమ్యాలు స్రుష్టించి అభివ్రుద్ధి జరగకుండా చేస్తోంది అని అన్నారు.గత టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో వైరం పెట్టుకున్నాదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో వైర్యం పెట్టుకుంటుందని, పేరు ప్రఖ్యాతుల కోసం మొండి పట్టుకు పోయి షో పొలిటిక్స్ చేస్తోంది అని అన్నారు. గతంలో వైర్యం పెట్టుకుంటే ఇది మంచి పద్ధతిగా అని చెప్పితే, రెండు నెలలు సఖ్యతగా ఉన్నదని, ఇప్పుడు మళ్లీ ధైర్యం పెట్టుకుంటుందని,ఇది మంచి పద్దతి కాదు అని,మితిమీరి విమర్శలు చేసి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయొద్దని అన్నారు.