Breaking News

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలిఎంపీడీవో రాములు

మనప్రగతిన్యూస్/పాలకుర్తి:

మెనూ ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు పౌష్టికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఎంపీడీవో ఏ రాములు గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. శనివారం మండలంలోని గూడూరు గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి తరగతి గదులను, వంటగదిని, ఆహార ధాన్యాలను, కూరగాయలను పరిశీలించి విద్యార్థినీలను భోజనం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినీలతో కలిసి ఎంపీడీవో రాములు, పాఠశాల ప్రిన్సిపాల్ రేణుక రాథోడ్ లు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాములు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. నాణ్యత గల ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలలో భోజన విషయంలో ఎలాంటి లోపాలు జరిగిన సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

-మండల కేంద్రంలో గల ప్రాథమికోన్నత పాఠశాలను పాలకుర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పాయం శోభారాణి సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిదురాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు విజయ్ కుమార్, ఎం శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్, ఎస్ విజయేందర్ లు పాల్గొన్నారు.