Breaking News

పాలకుర్తి, తొర్రూర్ బస్టాండ్లను సుందరీకరణకు నిధులు మంజూరు చేయాలి

మంత్రి పొన్నం ప్రభాకర్ న కోరిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

మనప్రగతిన్యూస్/పాలకుర్తి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

నియోజకవర్గ కేంద్రం పాలకుర్తి తో పాటు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్టాండ్లను సుందరీ కరణంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కోరారు. శనివారం హైదరాబాదులో గల మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంత్రిని కలసి నిధులు కేటాయించాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రం పాలకుర్తి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పాలకుర్తి బస్టాండులో సరైన వసతులు లేకపోవడంతో ప్రయాణికులు రాజీవ్ చౌరస్తా అనే బస్టాండుగా వినియోగించుకోవడంతో బస్సులు పాలకుర్తి రాజీవ్ చౌరస్తా నుండి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుచున్నాయని మంత్రికి వివరించారు. అరకొర వసతులు ఉన్నప్పటికీ బస్సులను బస్టాండుకు వెళ్లాలని ఆదేశించడంతో గత కొద్ది రోజులుగా బస్టాండుకు బస్సులు వెళుతున్నాయని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం లోని మహబూబాబాద్ జిల్లా పరిధిలో గల తొర్రూరు బస్టాండుకు బస్సుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి ఆర్టీసీ బస్సులు తొర్రూర్ కు వస్తాయని మంత్రికి వివరించారు. బస్టాండ్ ను పునరుద్ధరించడంతోపాటు మౌలిక వసతుల కల్పన కోసం పాలకుర్తి తొర్రూరు బస్టాండ్ లకు నిధులు మంజూరు చేయాలని తెలిపారు. స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బస్టాండ్ల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. స్పందించిన మంత్రికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.