అత్యధిక కన్విక్షన్ రేట్ గా మహబూబాబాద్ జిల్లా
గంజాయి కేసు లొ 11 కన్విక్షన్స్, 39 మందికి జైలు శిక్ష.
మన ప్రగతి న్యూస్/మహబూబాబాద్ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన రివార్డ్ మేళా లొ రాష్ట్రా వ్యాప్తంగా గంజాయి కేసులలో ఎక్కువ కన్విక్షన్స్ మహబూబాబాద్ జిల్లా కు వచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ద్వారా మహబూబాబాద్ పోలీసులు రివార్డ్ లు అందుకున్నారు.ఈ సందర్బంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ మాట్లాడుతూ
మహబూబాబాద్ జిల్లా లొ గంజాయి కేసులకు సంబంధించి ఎక్కువ కన్విక్షన్స్ రావడం అభినందనీయం అని అన్నారు.
ఒక కేసులో దొషికి శిక్ష పడాలి అంటే కోర్ట్ డ్యూటీ ఆఫీసర్, స్టేషన్ అధికారుల వరకు సాక్షులను ప్రవేశపెట్టడంలో, దర్యాప్తు చేయడంలో ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది అన్నారు.గంజాయి కేసులలో కన్విక్షన్స్ రావడంలో ప్రతిభ కనపరిచిన అధికారులకు, సిబ్బంది ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ రూరల్ సీఐ సరవయ్య, మరిపెడ ఎస్.ఐ సతీష్, బయ్యారం ఎస్.ఐ తిరుపతి తెలంగాణ రాష్ట్ర డీజీపీ చేతులమిదిగా రివార్డ్స్ అందుకున్నారు.