మనప్రగతిన్యూస్/పాలకుర్తి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల రాజీవ్ గాంధీ చౌరస్తాలో బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి లేగ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మహారాష్ట్రలో అధికారంలోకి తీసుకువచ్చా
యని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చౌడ రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు దొంగరి మహేందర్.
అధికార ప్రతినిధి నిరంజన్, మండల అధ్యక్షులు దుంపల సంపత్. జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రామారావు,
జిల్లా సీనియర్ నాయకులు భాగాల నవీన్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శిలు మారం రవి కుమార్,పెనుగొండ సోమేశ్వర్,వేల్పుల దేవరాజ్, గోనే అమరేందర్, పాలకుర్తి పట్టణ పార్టీ అధ్యక్షుడు పబ్బ సంతోష్, తొర్రూరు సహకారం బ్యాంక్ డైరెక్టర్ ఈర్ల రాజు,
లకావత్ రవి,పిట్టల సైదులు, రాజు పాల్గొన్నారు.