Breaking News

బిజెపి శ్రేణులు సంబరాలు

మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లోని స్థానిక పూసుగూడెం సెంటర్ లోని షాప్ ల్లో మరియు ప్రజలకు స్వీట్ మరియు క్రాకర్స్ తో సంబరాలు బీజేపీ శ్రేణులు అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు గుగులోత్ శంకర్ నాయక్ మాట్లాడుతు
మహారాష్ట్ర లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు భారీ విజయం అందించినందుకు వారికీ కృతజ్ఞతలు తెలిపినారు. దేశం లోని అన్ని రాష్ట్రాల ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అని అందుకే మహారాష్ట్ర లో కాంగ్రెస్ కూటమి ఎన్ని కుట్రలు పన్నిన ఎన్నో అబద్దపు ప్రచారాలు చేసిన అవి పట్టించుకోకుండా ప్రజలు ఎన్ డి ఏ కూటమినే గెలిపించారు అని అన్నారు. మోడీ నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అని భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో కూడ బీజేపీ మరియు ఎన్డీఏ కూటమినే ప్రజలు ఆదరిస్తారని అని అన్నారు. మహారాష్ట్రలో కొన్ని పార్టీ లు వల్ల పార్టీ మూల సిద్ధాంతాలు వదిలి కేవలం పదవుల కోసం ప్రాకులాడిన విధానాన్ని ప్రజలు గమనించి తగిన గుణపాఠం చెప్పినారు అని అన్నారు.ఈ కార్యక్రమం లో బీజేపీ పార్టీ నాయకులు బానోత్ మల్లేష్ రవి అశోక్ సూర్య మధు మల్లేష్ రాము శివ తదితరులు పాల్గొన్నారు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం