విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో :
జనగామ జిల్లా కేంద్రంలోని హనుమకొండ రోడ్డు లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కూర్చుని భోజనం చేశారు. ప్రతిరోజు టిఫిన్ ఏమి ఇస్తున్నారని కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నించగా ఇడ్లీ బోండా తో పాటు చపాతి ఇస్తున్నారని, ప్రతిరోజు రాగ జావా, ఇస్తున్నారని, అలాగే కోడిగుడ్లు పాలు అరటి ఇస్తున్నట్లుగా విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతోపాటు పౌష్టిక ఆహారం అందించాలని లక్ష్యంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వసతి గృహాల్లో విద్యనుప్సిస్తున్న విద్యార్థులకు మెనూ ప్రకారం చికెన్, మటన్, పండ్లు అందిస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని ఆయన విద్యార్థులకు సూచించారు.