మన ప్రగతి న్యూస్/ హుజూర్ నగర్
హుజూర్నగర్ పట్టణానికి చెందిన గురుస్వామి లక్కం శ్రీనివాస్ 18 వ పడి సందర్భంగా మనం పీఠం వద్ద స్వాములకు మరియు కుటుంబ సభ్యులకు బూరుగడ్డ ఆదివారహ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సద్ది ఏర్పాటు చేశారు. గురుస్వామి లక్కం శ్రీనివాస్ 18 ఓసారి మాల ధరించడంతో అయ్యప్ప లంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గురుస్వామి లక్కం శ్రీనివాస్ వందమంది అయ్యప్ప లకు సద్ది ఏర్పాటు చేసి వారి ఆశీస్సులను తీసుకున్నారు. అయ్యప్పలంతా కలిసి గురుస్వామి లక్కం శ్రీనివాసుని సన్మానించారు.
18 సంవత్సరాలుగా నిరంతరాయంగా మాల ధరిస్తూ అయ్యప్ప పై తనకున్న అభిమానాన్ని, ప్రేమను, భక్తిని చాటుకుంటున్నారు. అయ్యప్ప మాల అంటే కఠినమైనదనే అపోహను తొలగించి అయ్యప్ప అంటే అందరివాడు ముఖ్యంగా మనవాడు అని నిరూపించారు. అయ్యప్ప మాల ధరిస్తే మనిషి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాడని తెలియజేసిన గురుస్వామి లక్కం శ్రీనివాస్. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను అనుకున్న పనులు సంపూర్ణంగా సాధించగలుగుతున్నానని అయ్యప్ప అంటే చాలా ఇష్టమని చెప్పారు. మనిషిలోని దురాలవాట్లను కూడా అయ్యప్ప దూరం చేస్తాడని అయ్యప్ప మాల ధరించిన స్వాములు ఆరోగ్యంగా తము అనుకున్నది సాధించగలుగుతారని వారికి అయ్యప్ప వెంట ఉండి సహకరిస్తారని తెలిపారు. 18 సంవత్సరాలుగా అయ్యప్ప కటాక్షం తోనే మాల ధరిస్తున్నానని తెలిపారు. అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా మాల ధరించడం ఆయనకు అయ్యప్ప పై ఉన్న ప్రేమ, భక్తి తెలియజేస్తుందని అన్నారు. అయ్యప్పలకు ఆదర్శంగా ఉండడం మాల ధరించిన స్వాములకు పూజలు చేయడం అయ్యప్ప అంటే అందరివాడని తెలియజేయడం చాలా సంతోషం అన్నారు.ఈ కార్యక్రమంలో గురుస్వామి భూతం యాదగిరి, టీ పుల్లయ్య, టీ వీరయ్య, బి రమణ ,పి కోటేశ్వరరావు, నరసింహారావు స్వాములు పాల్గొన్నరు.