- సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు.. ఆచరణ అంతంత మాత్రమే
- నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
- నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం వృధా
- అధికారులు భాద్యతగా చర్యలు తీసుకోవాలి అని ప్రజల డిమాండ్
మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :
గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఉపాధిహామీ నిధులతో సెగ్రిగేషన్ షెడ్డు, డంపింగ్ యార్డ్ ప్రతి గ్రామంలో నిర్మాణం చేసినారు.అయితే ఆచరణలో మాత్రం వెనుకబడి అంతంత మాత్రంగానే ఉపయోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నవి.చాలా గ్రామాలలో షెడ్డులు ఖాళీగానే కనిపించడం జరుగుతుంది.చెత్త సేకరించడం అక్కడ జరుగుట లేదు.ఎరువుల తయారీ జరగడం లేదు.నన్ను పట్టించుకునేవారు లేరా అని సెగ్రిగేషన్ షెడ్డు ఘోషిస్తుంది.
రఘునాథపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో దాదాపుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణాలకు కోట్లు ఖర్చులు చేసింది.షెడ్లలలో ఎరువుల తయారీ కోసం ప్లాస్టిక్, ఇనుము,కాగితాలు, సీసాలు.. ఇలా ఒక్కొక్క వ్యర్ధాన్ని ప్రత్యేక అరలలో వేసే విధంగా ఏర్పాటు చేసినారు.ట్రాక్టర్, ట్రాలీ ల ద్వారా గ్రామాలలో చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డ్ కు తరలించడం చేయడం జరుగుతుంది.ఇక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువులు తయారీ చేయాలి.కానీ గ్రామ పంచాయతీలలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎరువుల తయారీ జరగడం లేదు.ప్రజల సొమ్ము వృధా అవుతుంది. ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతుంది.కొన్ని చోట్ల సిబ్బంది డంపింగ్ యార్డ్ లలో చెత్త వేసి వెళ్లిపోతున్నారు.వేరు చేసే సిబ్బంది లేకపోవడం కూడా ఎరువుల తయారీకి అద్దంకిగా మారిందనే అభిప్రాయాలు, అనుమానాలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి.కొన్ని చోట్ల యార్డ్ లలో నిప్పు పెడుతున్నారు.ఇలాంటివి జరుగకుండా భాద్యతగా అధికారులు ప్రజల సొమ్ము వృధా కాకుండా మరియు నిర్లక్ష్యం లేకుండా గ్రామాలలో ఉన్నటువంటి సెగ్రిగేషన్ షెడ్డును పూర్తిగా ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉపయోగం చేయాలని ప్రజలు కోరుతున్నారు.