మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో
మహబూబాబాద్ మండలం,
రెడ్యాల గ్రామం ఆశ్రమ ఉన్నత పాఠశాల ను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శనివారం రాత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా హాస్టల్లోని డైనింగ్ హాల్, స్టడీ రూమ్స్, టాయిలెట్స్, తదితర పరిసరాలను పరిశీలించారు.
విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని వార్డెన్ మోహన్ ను ఆదేశించారు.
విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.విద్య, ఆహారం, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.