Breaking News

బోనస్ బోగస్ కాలేదు…… బోనస్ సార్థకతమయింది

  • హరీష్ రావు జనగాం జిల్లాకు రా నిరూపిస్తా
    _ భాజపా , బిఆర్ఎస్ దివాలా కోరు రాజకీయాలంటూ ఫైర్
  • మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

మన ప్రగతి న్యూస్ / స్టేషన్ ఘన్‌పూర్:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

హరీష్ రావు, కేటీఆర్ లు అధికారం కోల్పోయి అక్కసుతో మాట్లాడుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు తోపాటు కేటీఆర్, హరీష్ రావు ధాన్యం కొనుగోలు జరగడం లేదు, బోనస్ అందడం లేదు అని దుష్ప్రచారం చేస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హరీష్ రావు, కేటీఆర్ లు జనగామకు రండి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ రైతు సంక్షేమానికి కృషి చేస్తుంటే బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు దివాలకోరు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. హరీష్ రావు బోనస్ బోగస్ అయిందని మాట్లాడుతున్నారని బోనస్ బోగస్ కాలేదని… బోనస్ అనేది సార్థకం అయిందని, నిజం అయిందని అన్నారు. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు వీలైతే అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి ఏడాది గడవక ముందే ప్రతిపక్షాలు పగటి కలలు కంటున్నాయని ఏద్దేవా చేశారు. వయనాడ్ లో 4లక్షల పైచిలుకు మెజారిటీతో భారీ విజయం సాధించిన ప్రియాంక గాంధీ కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక గాంధీ గెలుపుతో ఆయన హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చిందని అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య సిరీస్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.