Breaking News

15 న ప్రగతి శీల యువజన సంఘం (పి.వై.ఎల్ ) నిర్మాణ జనరల్ బాడిని జయప్రదం చేయండి

పి.వై.ఎల్ మండల నాయకుడు తాళ్ళ పెల్లి ప్రభాకర్

మన ప్రగతి న్యూస్ /కొత్తగూడ

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం

15 న కొత్తగూడలో జరిగే కొత్తగూడ గంగారం మండలాల పి. వై. ఎల్ నిర్మాణ జనరల్ బాడీ ని జయప్రదం చేయాలనీ కోరుతూ తాళ్ళ పల్లి ప్రభాకర్ (రాయుడు ) స్థానిక సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతూ
నేటి సమాజంలో జరుగుతున్న అవినీతి అసమానతలను కూకటి వేళ్ళతో తుంచి వేసే కర్తవ్యం యువతపై నేడు ఎంతైనా ఉందని వారు అన్నారు. అందుకనే డిసెంబర్ 15న కొత్తగూడ మండల కేంద్రంలో జరుగు ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ కొత్తగూడ గంగారం మండలాల నిర్మాణ జనరల్ బాడీకీ అన్ని గ్రామాల నుండి యువత అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పి. వై. ఎల్. నాయకులు ఈసం రామస్వామి,, భూక్య స్వామి,బిచ్చు,అనిల్, దేవేందర్ , తదితరులు పాల్గొన్నారు