యానాదులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ.
మన ప్రగతి న్యూస్ / సత్తుపల్లి ఆర్సీ
పేదల సాగు చేసుకుంటున్నా పోడు భూములకు హక్కు పట్టాలి ఇచ్చి ప్రభుత్వం సహాయం అందించాలని ఎర్రగుంటపాడు రెవిన్యూ సర్వేనెంబర్ 756 ను ఫారెస్ట్ ఆక్రమించి ఉందని దాన్ని సర్వే చేసి పేదలకు పంపిణీ చేసి పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు వేంసూరు మండలం వేంసూరు గ్రామం తో పాటు ఎర్రగుంటపాడు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ కల్లూరు ఆర్డీవో కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి ఆర్డిఓ రాజేందర్ గౌడ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా దండు ఆదినారాయణ మాట్లాడుతూ ఎర్రగుంటపాడు రెవెన్యూలో 756 సర్వే నెంబర్ను ఫారెస్ట్ ఆక్రమణలో ఉందని అట్టి భూమిని ఫారెస్ట్ రెవిన్యూ జాయింట్ సర్వే చేసి పేదలకు పంపిణీ చేయాలని అదేవిధంగా అమ్మపాలెం గ్రామంలో పేదలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములు రాజ్యసభ సభ్యుడుఆక్రమించుకొని 99 సంవత్సరాలు కవులకు లీజుకు తీసుకొని పేదలను మోసం చేసి ఆక్రమించుకున్నారని అట్టి భూములను సర్వే చేసి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఇంకా వేంసూరు గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉన్నాయని వాటిని తీసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా యానాదులు అందరికీ ఎర్రగుంటపాడులో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేదల ఆదుకోవాలని ఆర్డిఓ కి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మహిళా సమాఖ్య సత్తుపల్లి డివిజన్ కన్వీనర్ ఎస్.కె రంజాన్ బి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎగసి వెంకటేశ్వరరావు తుమ్మల అంజమ్మ పూతాడి వెంకటమ్మ సరోజిని రంగారావు సీత సుబ్బారావు శ్రీను సుజాత సీతమ్మ వెంకటేశ్వరరావు దేవి చెంచమ్మ సత్యం వందమందికి పైగా పేదలు తదితరులు పాల్గొన్నారు.