జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్నా 7470 మంది అభ్యర్థులు…
21పరీక్ష కేంద్రాలు…
ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో
మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో
కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. వీరబ్రహ్మచారి, అదనపు ఎస్పీ చెన్నయ్య, గ్రూప్ -2 పరీక్షల ఆర్సిఓ డాక్టర్ బలరామ్ నాయక్, సంబధిత అధికారులతో కలిసి గ్రూప్ -2 పరీక్షల నిర్వహణపై ఇన్చార్జి,అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్– 2 పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని,
జిల్లా వ్యాప్తంగా 21 పరీక్ష కేంద్రాలలొ 7470 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవనున్నారు.డిసెంబర్ 15 వ తారీకు ఉదయం 10. నుండి 12. 30, వరకు, మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం 5.30 వరకు,డిసెంబర్ 16వ తారీకు ఉదయం 10 గంటల నుండి 12.30. వరకు, మధ్యాహ్నం 3. గంటల నుండి సాయంత్రం 5. 30 వరకు నాలుగు దఫాలుగా పరీక్షలు జరుగుతాయనీ తెలిపారు.
పరీక్ష కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం అభ్యర్థులు వ్యవహరించాలని, మొబైల్ ఫోన్స్,ఎలక్ట్రానిక్స్ వస్తువులతో రాకూడదని,
పరీక్షలు జరుగు కేంద్రాల వద్ద 144, సెక్షన్ విధించి, రక్షణ చర్యలు తీసుకుని ఆ ప్రాంతంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయడం జరుగుతుందని తెలిపారు.
పరీక్షా కేంద్రాలలో విద్యుత్ సదుపాయం సరిచూసుకోవాలని, టాయిలెట్స్, త్రాగునీరు, అన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత సెంటర్ నిర్వాహకులకు సూచించారు.
పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
విద్యుత్ అంతరాయం రాకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.కేంద్రాల వద్ద సానిటేషన్ నిర్వహించాలని, పరీక్షలు జరిగే సమయాలలో అభ్యర్థుల సౌకర్యార్థం బస్సుల సమయాలను మార్చాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తొర్రూరు, మహబూబాబాద్ ఆర్డీవోలు గణేష్,కృష్ణవేణి, డి ఆర్ డి ఓ మధుసూదన్ రాజు, డిపిఓ హరిప్రసాద్, డివిహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, డిడి కి రెండు వాటర్ వేముల సురేష్, తహసీల్దర్లు, గ్రూప్ 2, పరీక్షల ప్రత్యేక అధికారులు, చీప్ సూపర్డెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, కలెక్టరేట్ పర్యవేక్షకులు భద్రకాళి, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.