మన ప్రగతి న్యూస్/హత్నూర:
సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ గ్రామపంచాయతీ కార్యదర్శి పల్లె బాలరాజు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కార్యదర్శి పై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని ఓబీసీ జిల్లా మోర్చా మాజీ కార్యదర్శి బిట్ల మహేష్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠం పరిధిలో ఇంటి స్థలం ధ్రువ పత్రాలు ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా ఆన్లైన్లో తక్కువగా చూపిస్తూ ఒరిజినల్ సర్టిఫికెట్ల ప్రకారం ఆన్లైన్ సర్టిఫికెట్ కావాలంటే లక్షల్లో డిమాండ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆన్లైన్ లో సరి చేసుకోకుంటే మరో ఐదు సంవత్సరాలు ఆన్లైన్ కాదని అందుకు ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు లోన్ కానీ ఇతర ప్రవేట్ సంస్థ నుండి ఎలాంటి లావాదేవీలు జరగబోవని భయభ్రాంతులకు గురిచేస్తూ లక్షల రూపాయలు దండు పోవడం విచారకరమని ఆయన మండిపడ్డారు. పంచాయతీ కార్యదర్శి బాలరాజు నిర్ణయించిన అమౌంటూ సఖ్యత కుదిరితే క్షణాల్లో ధ్రువపత్రాలు మంజూరు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
దౌల్తాబాద్ గ్రామపంచాయతీ నిధులు సుమారు 18 లక్షల వరకు ఇతర ప్రైవేటు వ్యక్తుల అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వారి సొంత చేక్కులతో మళ్లీ విత్ డ్రాలు చేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పంచాయతీ కార్యదర్శి బాలరాజు పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అన్నారు. పంచాయతీ కార్యదర్శి పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు లేనియెడల దౌల్తాబాద్ గ్రామ ప్రజల పక్షాన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పటేల్ శ్రీశైలం, ధనుంజయ గౌడ్, రాజేష్, కుమ్మరి రమేష్, నాగరత్నం గౌడ్, కుమార్ ,తదితరులు పాల్గొన్నారు