అందరినీ ఆకట్టుకుంటున్న పథకాలు, ఇలా…
మణుగూరు డివిజన్ పోస్టల్ అధికారి, రామ్మూర్తి.
మనప్రగతి న్యూస్ పినపాక:
ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లో చాలానే స్కీములు
ఉన్నాయని,. కానీ ఒకప్పటి పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాలు మరియు ఇతర సమాచారాలను చేరవేసేది మాత్రమే. కానీ ఇప్పుడు అప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొన్ని కొత్త కొత్త స్కీములను జోడించి అందరిని కూడా తన వైపు తిప్పుకుంటుందని మణుగూరు డివిజన్ పోస్టల్ అధికారి ప్రజాపక్షం దినపత్రిక రిపోర్టర్ తో తెలిపారు.
ఇప్పటికి పోస్ట్ ఆఫీస్ అనేక రకాల సేవలను ప్రజలకు అందిస్తుండడంతో సామాన్య ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు పోస్ట్ ఆఫీస్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
గ్రామీణ
ప్రాంత ప్రజలను దృష్టిలోపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్తగా గ్రామీణ తపాల జీవిత బీమా పథకంను తీసుకొచ్చిందని, పదివేల నుండి పది లక్షల వరకు ఇన్సూరెన్స్ స్కీమ్లు తీసుకువచ్చిందని తెలిపారు. అన్ని స్కీములు కన్నా బెస్ట్ స్కీముగా అభివర్ణిస్తున్నారు.
ఇక ఈ స్కీమ్లో పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయస్సు వారు మాత్రమే జాయిన్
అవ్వాలని కోరారు. ఒకవేళ ఈ పథకం మధ్యలో డబ్బులు లేక ఆపినా తిరిగి మళ్లీ పునరావృతం చేసుకునేలా ఏర్పాటు చేశారని తెలిపారు.
ఇక ఈ పథకంలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే. పదివేల నుండి పది లక్షల వరకు ఈ స్కీం తీసుకోవడానికి అందుబాటులో ఉంది. బయట వాళ్ల స్కీం కంటే రేట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ స్కీమ్ లబ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నారు.
ఇపాలసి ఒక కుటుంబంలో యజమాని తీసుకుంటే అనుకోకుండా మరణం చెందిన కూడా అతని కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ డబ్బులు అందిస్తారని చెప్పుకొచ్చారు. పాలసీ మధ్యలో ఎప్పుడైనా డబ్బులు లేకపోయినా సరే కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్ళీ పాలసీ కొనసాగించవచ్చు అని రామ్మూర్తి తెలిపారు.
ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు,ఫోటో, నామిని డీటెయిల్స్ తీసుకొని స్థానిక పోస్టల్ ఆఫీస్ కి వెళ్తే ఈ పథకం పేరు చెప్పగానే పదివేల నుండి యాభై వేలు మరియు, లక్ష లేదా పది లక్షల వరకు ఇన్సూరెన్స్ ఒక నెలవారీగా ఎంత కట్టాలో పోస్టల్ అధికారిని అడిగితే పూర్తి వివరాలు చెప్తారని తెలిపారు.
భవిష్యత్తు పిల్లల కోసం అలాగే డబ్బులు ఎవరైతే, కూడ పెట్టుకోవాలని అనుకుంటారో వారికి ఇది చాలా మంచి అవకాశం, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.