Breaking News

కమిషన్ ల కక్కుర్తి కోసం ఆలస్యం అవుతున్న రిజర్వాయర్ ల పనులు

-బిజెపి జిల్లా అధ్యక్షుడు డా ఆరుట్ల దశమంత్ రెడ్డి

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి :

కమిషన్ ల కక్కుర్తి కోసం చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్ ల పనులు నత్త నడకన నడుస్తున్నాయని బిజెపి జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆరుట్ల దశమొదటి అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని చెన్నూరు పాలకుర్తి గ్రామాల్లో చేపట్టిన రిజర్వాయర్ ల పనులను బిజెపి పార్టీ ప్రతినిధి బృందం పరిశీలించి జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

ఈ సందర్భంగా దశమొదటి మాట్లాడుతూ శాసనసభ్యురాలు అసెంబ్లీ లో చెప్పినట్టుగా జిఎస్టీ కి అనుగుణంగా నిధులు పెంచాలనే డిమాండ్ లక్ష్యమే చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్ లను ఏటీఎం లు గా మార్చుకునే ప్రక్రియలో భాగమేనని ఆరోపించారు. జిల్లా లోని చెన్నూరు, పాలకుర్తి, ఉప్పుగల్లు రిజర్వాయర్ లకు మొదట 370 కోట్లు కేటాయించినప్పటికి రి డిజైన్ పేరుతో 420 కోట్లకు పెంచారని అన్నారు. అయినప్పటికీ నేటికీ పనులు పూర్తికాకపోవడం శోచనీయమని అన్నారు. అసెంబ్లీ లో రిజర్వాయర్ ల ప్రస్తావన తీసుకొచ్చిన శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పెరిగిన జి ఎస్ టి సాకుగా చూపుతూ 620 కోట్లకు వ్యయాన్ని పెంచాలని డిమాండ్ చేయడం రిజర్వాయర్ ను అడ్డుపెట్టుకొని సంపాదన కోసం వేంపర్లాడడమే అని అన్నారు. 0.5 టిఎమ్ సి చెన్నూరు, 0.25 టి ఎమ్ సి పాలకుర్తి రిజర్వాయర్ లు పూర్తయితే 32 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రచారం చేసిన మాజీ మంత్రి రెబల్ దయాకర్ రావు తోపాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పనులు జాప్యం చేస్తూ కాసులకు కక్కుర్తి పడి ప్రజాధనం దుర్వినియోగం చేశారని అన్నారు. నిర్మాణం లో భాగస్వామ్యం అయి మొదట్లో ఎస్.డబ్ల్యూ క్రాంతి కన్ స్ట్రక్షన్స్ పనులను మధ్యలో వదిలేసిన కంపెనీ తో పాటు ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న జివి ఆర్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ ల స్థితిగతులపై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనుకున్న సమయంలో రిజర్వాయర్ లు పూర్తి చేయకపోతే బిజెపి ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రిజర్వాయర్ పర్యటన పరిశీలన కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు సౌడ రమేష్, శోభనబోయిన శివరాజ్, పాలకుర్తి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పూసాల శ్రీమాన్, జాయింట్ కన్వీనర్ సుంకరనేని కొటేశ్వర్ జిల్లా కార్యదర్శి మోడేపల్లి సోమన్న, జిల్లా అధికారప్రతినిధి కడుదుల నిరంజన్ రెడ్డి, జిల్లా నాయకులు కామ్మగాని శ్రీకాంత్, పాలకుర్తి, కొడకండ్ల తొర్రూరు మండలాల అధ్యక్షులు దుంపల సంపత్, పులిగిల్ల ఉపేందర్, పల్లె కుమార్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఐర్నెని రామరావు మండల ప్రధాన కార్యదర్శి మారంరవి ,ఈర్ల రాజు తొర్రూర్ డైరెక్టర్ ఎస్టీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ దారావత్ శ్రీను నాయక్, మాజీ సర్పంచ్ దేవరాజ్, పాలకుర్తి మండల గిరిజన అధ్యక్షులు లకావత్ రవి, పట్టణ అధ్యక్షుడు పబ్బ సంపత్, నూకల నవీన్ నాయకులు, ఆంజనేయులు, sc మోర్చా మండల కోడిశాల యాదగిరి, పట్టణ అధ్యక్షుడు పబ్బ సంపత్ బిజెవైఎమ్ జిల్లా కార్యదర్శులు రాణాప్రతాప్, జిల్లా ఓబీసి మోర్చా కార్యదర్శి సమ్మయ్య చారీ, జోగు వెంకన్న, కర్ణాకర్.. తదితరులు పాల్గొన్నారు..