Breaking News

నిరుద్యోగ జాబ్ మేళ అప్రెంటిషిప్ ను సద్వినియోగం చేసుకోవాలి…కె. శ్రీనివాసరావు

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో

జిల్లాలోని నిరుద్యోగులు ఈ నెల 11 వ తేదిన సికింద్రాబాద్ లో జరిగే నిరుద్యోగ జాబ్ మేళ అప్రెంటిషిప్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సి కార్పొరేషన్ కార్య నిర్వాహక సంచాలకులు కె. శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపార్టుమెంటు అఫ్ టెక్నాలజీ ఎడుకేషన్ తెలంగాణ వారు సికింద్రాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజి లో నిరుద్యోగ జాబ్ మేళా ను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. ఇట్టి జాబ్ మేళాకుసం.2020-2024 సంవత్సరంలో పాసైన ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, ఫార్మసీ, టెక్నికల్ వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిగతా వివరాలకు 9849828586, 8185909695, నంబర్లలో సంప్రదించాలని కోరారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం