Breaking News

భక్తులతో మారుబ్రోగిన శ్రీశ్రీశ్రీ దత్తాచల క్షేత్రం క్షేత్రంహాజరైన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

మన ప్రగతి న్యూస్/హత్నూర:

భక్తులతో మారుబ్రోగిన శ్రీ శ్రీ శ్రీ దత్తాక్షల క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలు జాతర లో భాగంగా క్షేత్రాధిపతి సభాపతి శర్మ, ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుండి మహా పాదయాత్ర దత్తాక్షల క్షేత్రం వరకు కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై ధ్వజరోహణ, బ్రహ్మోత్సవములు దత్తాత్రేయ స్వామి వారి నామ సంకీర్తన వివిధ కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళు గోపురాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. దత్తాత్రేయ స్వామి వారి కృప కటాక్షము మండల ప్రజలపై ఎప్పుడు ఉండాలని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వావిలాల నరసింహులు, నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి, బైసాని వెంకటేశం గుప్తా, వివిధ గ్రామాల భక్తులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం