Breaking News

రాష్ట్ర ప్రభుత్వం తల్లి విగ్రహ ఏర్పాటు చేయడానినిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రి దయాకర్ రావు

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:

రాష్ట్ర ప్రభుత్వం తల్లి విగ్రహం ఏర్పాటు చేయడాని నిరసనగా బి ఆర్ ఎస్ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం జనగామ జిల్లాలోని దేవరపుల మండలం సీతారాంపురం గ్రామంలో, కొడకండ్ల మండలంలో గల తెలంగాణ తల్లి విగ్రహాలతో పాటు పాలకుర్తి మండలంలోని దర్దేపల్లి గ్రామంలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఉద్యమకారులు ఆవుల వీరన్న, బస్వా రమేష్, బాశిపాక కొండయ్యలను సన్మానించారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి అని విమర్శించారు. మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చాక కూడా తన ప్రవర్తన మారటం లేదు. నాడు సోనియా గాంధీని బలి దేవత అని నేడు సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా ఏ దేవ చేశారు. ఒకపక్క ఆశా వర్కర్లను పోలీసులతో అరెస్టులు చేస్తూ లాఠీచార్జీలు చేస్తూ, తెలంగాణ తల్లి విగ్రహం లోని బతుకమ్మను తొలగించి యావత్ తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ, మహిళాభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అనడానికి సీఎం కు నోరేలా వచ్చింది విమర్శించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకో వాటిని మార్చి చరిత్ర ని మార్చాలనుకోవటం ని మూర్ఖత్వం అవుతుందని అన్నారు. ఆనాడు ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని ఎలా పాలించిందో, నేడు రేవంత్ రెడ్డి పాలన అదే తీరు తలపిస్తుంది ఉన్నారు. ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్న ని ప్రవర్తన మార్చుకో ప్రజలను ఇబ్బందులకు గురిచేయకు అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లానాయకులు, దేవరుప్పుల ,కొడకండ్ల, పాలకుర్తి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో పాటు గ్రామ నాయకులు పాల్గొన్నారు.