మన ప్రగతి న్యూస్/ పిట్లం:
టి పి టి ఎఫ్ కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా చింతల లింగం, జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం టిపిటిఎఫ్ కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించి సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సిహెచ్ లక్ష్మి, విజయ శ్రీ, తృప్తి శ్రీనివాస్, హరి సింగ్ నరేందర్, గోపి శ్రీనివాస్, సిహెచ్ ప్రకాష్, కృష్ణ, కృష్ణమూర్తి, హరీష్, కే ఎన్ భగత్ రామా గౌడ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.