బి. ఆర్ ఎస్ పార్టి అధ్వర్యంలో తెలంగాణ తల్లి కీ పాలాభిషేకం
మన ప్రగతి న్యూస్ /కొత్తగూడ
భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు అధ్యక్షతన మండల కేంద్రంలో పాలాభిషేకం నిర్వహించారు.ఈసందర్బంగా మండల అధ్యక్షులు కొమ్మెనబోయిన వేణు మాట్లాడుతూ
తెలంగాణ తల్లీ చేతిలోఉన్న బతుకమ్మ ను,కిరీటాన్ని,కాళ్ల కడియలను ఆబరనాలను తీసివేసి తెలంగాణ తల్లినీ అవమానపరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర హీనుడిగా కాలగర్భంలో కలిసిపోతాడని, ఆయన చేసే వెకిలి చేష్టలు కరెక్ట్ కాదని హెచ్చరించారు.
తెలంగాణ బతుకమ్మ ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా పువ్వులను పూజిస్తూ బతుకమ్మ రూపంలో బతుకునిచ్చే తల్లిగా కొలిచే బతుకమ్మ రూపాన్ని తీసివేయడం హేయమైన చర్య గా భావిస్తున్నాము.భారత మాతకు, తెలుగు తల్లికి కిరీటం ఉన్నప్పుడు భారత మాతబిడ్డ అయిన తెలంగాణ తల్లి కీ కిరీటం ఎందుకు ఉండ కూడదు అని అడుగుతున్నాము.ఇప్పటికీ అయినా రేవంత్ రెడ్డి అనాలోచిత పనులు పక్కకు పెట్టీ మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద దృష్టి సారించాలని హితవు పలికారు.
ఈ కార్య్రమానికి కొత్తగూడ మాజీ సర్పంచ్ భూపతి తిరుపతి, మాజీ సర్పంచులు బాణోత్ సుగుణ కిషన్నాయక్, పుల్సం నారాయణ,అజ్మీరా రజిత రమేష్ నాయక్, మాజీ ఎంపిటిసి లు మోకాళ్ల సంతోష రాణి వెంకటేష్, ననుబోతుల స్వప్న లింగన్న యాదవ్, గ్రామ పార్టి అధ్యక్షులు అల్లెంగుల బాలకోమురు, బొల్లు రవి, పిడబోయిన వీరస్వామి, మండల నాయకులు వాసం వెంకన్న,జిమ్మిడి వెంకటేశ్వర్లు, అజ్మీరా రాజన్న, గుగ్లోత్ సురేశ్ నాయక్, పెండ్లి సదయ్య, లెంకల పెళ్లి శ్రీనివాస్, కాసాని అయిలయ్య, మాలోతు రంగన్న నాయక్, ,కార్యకర్తలు, తది తరులు పాల్గొన్నారు.