మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో మంగళవారం రోజున చౌటుప్పల్ లో ఈనెల 15,16,17 తేదీలలో జరిగే సిపిఎం పార్టీ,జిల్లా బహిరంగ సభను జయప్రదం చేయాలని మండల కేంద్రంలో బైకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ జిల్లా ఆవిర్భవించి ఎనిమిది ఏళ్లయిన అనేక ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని దశాబ్దాలుగా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వ్యవసాయమే జీవనాధారమైన చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగము సరైన సాగునీటి వసతి లేక సతమతమవుతున్నారు.నీళ్లు లేక వందల ఎకరాల భూములు బిల్లుగా మారిపోయాయని అన్నారు.జిల్లాలో నేలకొల్పిన ఎయిమ్స్ వైద్యము సమస్త పూర్తిస్థాయి వైద్యాన్ని అందించలేకపోతున్న ప్రభుత్వాలు విఫలమైతున్నాయి.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయినా ఆరు గ్యారెంటీ లఅమలులో విఫలమయింది 6 గ్యారంటీలు అమలు చేయాలని సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.అదేవిధంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి10 సంవత్సరాలు అవుతున్న కార్మికులని కర్షకులని రైతులని అనేక కొత్త చట్టాలు తెచ్చి ఆందోళనకు గురి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు వవల్దాసు సతీష్,సయ్యద్ ఉమర్,నాయకులు మంద కిరణ్ కుమార్,మాదారం శివకుమార్,వవల్దాసు హరికృష్ణ, శ్రావణ్ కుమార్,కుమ్మరి రాజు,లోకదాస్ పవన్,గడ్డం వెంకటేష్,బండారి భగత్ తదితరులు పాల్గొన్నారు.