Breaking News

తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి!!

తెలంగాణ తల్లి విగ్రహం రాజకీయ లబ్ధి కోసమే!!

రూపం మారిన తెలంగాణ తల్లి

మన ప్రగతి న్యూస్/వనపర్తి బ్యూరో

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 9న ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ పార్టీ తల్లి గా అభివర్ణించారు బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మున్నూరు రవీందర్. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరాధన భావం కలిగిన అందరినీ ఆకర్షించే విధంగా ఒక దేవత మాదిరిగా రూపాంతరం పొందిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజకీయాల కుట్రతో తెలంగాణ తల్లి విగ్రహముని రూపురేఖలు మారుస్తూ తెలంగాణ గీతం కూడా మార్చడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా తయారుచేసిన తల్లి విగ్రహానికి చాలా తేడా ఉందని గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడు ఉన్న కొత్త విగ్రహానికి పోలిక లేదని అన్నారు,ఈ విషయం రాష్ట్ర ప్రజలు గమనించిన సంగతి ఈ ప్రభుత్వం గుర్తు ఎరగ లేకపోతుందని ఆయన అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ విగ్రహం మార్పు జరిగిందని ఆయన దుయ్యబట్టారు. కెసిఆర్ పై ఉన్న కోపం కక్షపూరితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్లీ కొత్తగా తయారు చేయడం పట్ల ప్రజల్లో వ్యతిరేక భావన నెలకొన్నదని మున్నూరు రవీందర్ అన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఉంది కానీ తెలంగాణ తల్లిని వ్యవసాయ కార్మికురాలుగా కించపరిచే విధంగా తయారు చేశారని ఆయన అన్నారు. గతంలో దేవత మూర్తి పోలికతో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పటి కొత్త విగ్రహానికి చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. కేవలం తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి రాజకీయాన్ని తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ తిప్పుతున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కుంటుపడిపోతుందని ఇప్పటివరకు ప్రజా సమస్యలు గాలికి వదిలి గాలి మోటార్లలో ముఖ్యమంత్రి ప్రజా పరిపాలన ప్రజా విజయోత్సవాల పేరుతోనా సుడిగాలి పర్యటన చేసి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని వచ్చే స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఈ పర్యటనలు చేసి ప్రజల్లో మెప్పు పొందడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయలేని ఈ ప్రభుత్వం 2 లక్షల పైన ఉన్న రుణాల సంగతి రైతులకు చెప్పాలని గతంలో ఉన్న రైతు బంధు పథకాన్ని పేరు మార్పిడి చేస్తూ రైతు భరోసాగా పేరు పెట్టి ఒక రూపాయి కూడా ఇప్పటికి రైతులకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు, కేవలం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు గతంలో ఉన్న సంక్షేమ పథకాల పేర్లు మార్పు చేయడం సొల్లి కబుర్లు చెప్పడానికి కాలం సరిపోతుందని ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయవలసిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా ఉందని చెప్పిన ముఖ్యమంత్రి ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అనవసరమైన పనులు చేస్తున్నాడని ప్రశ్నించారు, ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆరు మోసాలు 66 అబద్దాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, ప్రభుత్వ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతుంటే ముఖ్యమంత్రి 2024 డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఆయన ఆరోపించారు. ఈ విధంగా ప్రతి ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం విస్మరించిందని మాయ మాటలతో తుపాకీ రాముడు మాటలు ముఖ్యమంత్రి మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.