ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నమని గొప్పలు చెబుతూ, మరో వైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై పోలీస్ ( పురుషులు ) దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
తెలంగాణ రాష్ట్ర సమితి
చౌటకురు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు
కాశపాగ ఇమ్మయ్య
మన ప్రగతి న్యూస్ /సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో
బి ఆర్ స్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్
కె టీ ఆర్ మరియు మాజీ మంత్రి హరీష్ రావు ల పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహనికి పాలభిషేకం చేసి పూల మాలవేసిన అనంతరం
బి ఆర్ స్ పార్టీ నాయకులు కాశపాగ ఇమ్మయ్య మాట్లాడుతూ సచివాలయం లో ప్రతిష్టించిన విగ్రహం తెలంగాణ తల్లీ కాదు సవతి తల్లి అన్నారు. కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలి అనుకున్నవారు ఎంతోమంది నాయకులు ఇప్పుడు లేకుండా పోయినారని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తమని అభయహస్తం మేనిఫెస్టో పేజీ నెంబర్ 26లో హామి ఇచ్చారు.
ప్రభుత్వం ఏర్పడి సంవత్సర0 గడుస్తున్నా సందర్బంగా ఇప్పుడు ఆ హామీ అమలు చేయాలంటూ అశా అక్కా చెల్లెళ్లు రోడ్డెక్కితే పురుషుల పోలీసులతో ఇష్టారీతిన కొట్టించడం దుర్మార్గం.
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు సేవలందించే ఆశా వర్కర్లకు నిరసన తెలియచేసే
హక్కు లేదా? సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్చ లేదా?తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆశాల గౌరవ వేతనం రూ. 1500 మాత్రమే ఉంటే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 10 వేలకు పెంచి వారి సేవలను గుర్తించి, వారిని గౌరవించారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి కి మతిభ్రమించి చేయాల్సిన పనులు అనేకం ఉన్నపటికీ కెసిఆర్ పై కోపంతోనే తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం జరిగింది. మనకు జన్మనిచ్చిన తల్లిని మార్చానిది నాలుగు కోట్ల మంది మెచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా మారుస్తారని ఆయన అన్నారు. ప్రశ్నిస్తే పోలీసులతో పళ్లూడగొట్టించే దుర్మార్గ వైఖరిని అవలంబిస్తూ, ఆశాల ఆశలపై నీళ్లు చల్లుతుండటం సిగ్గుచేటు. ముందు మహిళలకు ఇస్తామన్నా నెలకు 2500 ఇవ్వాలని మేనిపెస్టో లో ప్రకటించిన హామీలని నెరవేర్చలని అయన అన్నారు.ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ వి జిల్లా నాయకులు రాజేందర్ నాయక్. శ్రవణ్ రెడ్డి. లక్ష్మన్ వినోద్ కుమార్ రేగోడ్ మండల మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.